రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గురువారం పర్యటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా...
రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గురువారం పర్యటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గురువారం పర్యటించారు. పర్యటన లో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓ డి టవర్లను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జిఎడి కి అప్పగిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ సందర్బంగా తెలిపారు. అనంతరం నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలను మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యే లకు మంత్రి నారాయణ వివరించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కర్ణాటకకు బెంగుళూరు, తమిళ నాడుకు చెన్నై, తెలంగాణా కు హైదరాబాద్ నుండి 70 శాతం ఆదాయం ఆందిస్తున్నట్లే, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఆదాయం ఇస్తుందన్నారు. సచివాలయం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సుమారు 16,000 మంది ఒకేచోట పని చేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారు అని పేర్కొన్నారు. ప్రపంచం లోనే అత్యంత పొడవైన సెక్రటేరియట్ భవనంగా 204 మీటర్లు ఎత్తుతో నిర్మిస్తున్నారని చెప్పారు. దేశంలోనే సచివాలయం, హెచ్ఓడి టవర్లు ఒకే చోట మెదటి సారిగా నిర్మిస్తున్నది మన రాష్ట్రంలోనే అని తెలిపారు.
మంత్రి నిమ్మల Dr.Nimmala Rama Naidu , టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు Palla Srinivasa Rao తో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించి, నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ నివాస టవర్లు, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ పురోగతి, నాణ్యతా ప్రమాణాలను వివరించాను. - ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ నివాస టవర్లు, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. పనులు పూర్తికాగానే త్వరలోనే GADకి భవనాలను అప్పగిస్తాం. - ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణాలు చేపడుతున్నాం. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా భవనాలను నిర్మించడంతో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు త్వరలోనే ఇక్కడి నుంచే విధులు నిర్వహించేలా అన్ని వసతులు కల్పిస్తున్నాం. - ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక వసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్‌తో పాటు అన్ని కీలక ప్రాజెక్టులు ప్రణాళిక ప్రకారం పూర్తవుతున్నాయి.
Related articles
