రాజధాని అమరావతి నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం పరిశీలించారు. పర్యటన లో భాగంగా అమరావతి లోని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవే కి అనుసంధానించే పనులు మంత్రి నారాయణ పర్యవేక్షణ చేశారు...
రాజధాని అమరావతి నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం పరిశీలించారు. పర్యటన లో భాగంగా అమరావతి లోని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవే కి అనుసంధానించే పనులు మంత్రి నారాయణ పర్యవేక్షణ చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో భాగంగా రెండు స్టీల్ బ్రిడ్జి లను ప్రభుత్వం నిర్మిస్తోంది. బకింగ్ హామ్ కెనాల్,కొండవీటి వాగులపై స్టీల్ బ్రిడ్జి ల నిర్మాణం దాదాపుగా పూర్తి కానున్నాయి అని మంత్రి నారాయణ ఈ సందర్బంగా తెలిపారు.
విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతి కి ప్రవేశించేలా పూర్తి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కావస్తుందని వివరించారు. స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యేలోపు పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఈ సందర్బంగా ఆదేశాలు జారీ చేశారు.
Related articles
